హనుమకొండ చౌరస్తా, జులై 10 : సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్నవారు హాల్ టికెట్స్డౌన్లోడ్ చేసుకోవాలని షెడ్యుల్డ్కులాల అధ్యయన కేంద్రం వరంగల్ శాఖ సంచాలకులు డాక్టర్ కొంగర జగన్మోహన్ తెలిపారు. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి.యస్.ఎ.టి) 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చారు.
ప్రవేశ పరీక్ష 13న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించనున్నట్లు, ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్ హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత వసతి భోజనంతో కూడిన 10 నెలల పాటు శిక్షణ ఇస్తారన్నారు.