Samsung Galaxy Z Flip 7 | ఫ్లిప్ ఫోన్లను తయారు చేయడంలో పేరు గాంచిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. గెలాక్సీ జడ్ సిరీస్‌లో ఫ్లిప్ 7, ఫ్లిప్ 7ఎఫ్ఈ పేరిట ఈ ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది. న్యూయార్క్‌లో నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్లలోనూ ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 స్మార్ట్ ఫోన్లో 6.9 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక డిస్ప్లే చాలా నాణ్యమైన దృశ్యాలను ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. చాలా క్వాలిటీ అయిన దృశ్యాలను ఈ తెరపై వీక్షించవచ్చు. కవర్ డిస్ప్లే 4.1 ఇంచుల సైజ్ ఉండగా ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే కావడం విశేషం. దీనికి కూడా 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 3.3 గిగాహెడ్జ్ డెకాకోర్ ఎగ్జినోస్ 2500 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ ర్యామ్ లభిస్తుంది. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను, ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 5జి, 4జి, వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, ఐపీ 48 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. కవర్ డిస్ప్లే సైజ్ 3.4 ఇంచులు ఉండగా ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే కావడం విశేషం. ఈ ఫోన్‌కు కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో 3.2 గిగాహెడ్జ్ డెకాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ ఉంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50, 12 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 5జి, 4జి, వైఫై 6, బ్లూటూత్ 5.3 ఎల్ఈ, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, ఐపీ 48 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,21,999 గా ఉంది. అలాగే గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.95,999గా ఉంది. ఈ ఫోన్లకు గాను ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.12వేల విలువైన బెనిఫిట్స్‌ను అందించనున్నారు.