SL vs AFG | మూడో వన్డేలో చిత్తుగా ఓడిన అఫ్గనిస్థాన్.. సిరీస్ శ్రీలంక కైవసం
SL vs AFG : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) సొంత గడ్డపై చెలరేగింది. బ్యాటర్లు, బౌలర్లు విజృంభించడంతో సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారీ విజయం సాధించింది. పర్యాటకు అఫ్గనిస్థాన్‌ను చిత్తుగా ఓడించి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(56 నాటౌట్), ప్రథుమ్ నిస్సంక(51) దంచి కొట్టడంతో...
SL vs AFG : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) సొంత గడ్డపై చెలరేగింది. బ్యాటర్లు, బౌలర్లు విజృంభించడంతో సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారీ విజయం సాధించింది. పర్యాటకు అఫ్గనిస్థాన్‌ను చిత్తుగా ఓడించి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(56 నాటౌట్), ప్రథుమ్ నిస్సంక(51) దంచి కొట్టడంతో లంక 9 వికెట్ల తేడాతో గెలిచింది.
మొదట దుషమంత చమీర 4 వికెట్లతో అఫ్గనిస్థాన్ పతనాన్ని శాసించాడు. అఫ్గనిస్థాన్ 22.2 ఓవర్లకే ఆలౌటయ్యింది. ఆ తర్వాత 117 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో, 2-1తో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది.
Sri Lanka defeat Afghanistan in the third ODI and win the series 2-1 🎉#SLvAFG | 📝: https://t.co/7i1axAFaiq pic.twitter.com/mZbbZDAAHj
— ICC (@ICC) June 7, 2023
చేతులెత్తేసిన అఫ్గన్ బ్యాటర్లు
తొలి వన్డేలో ఇరగదీసిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు కీలకమైన మూడో వన్డేలో తడబడ్డారు. చమీర ధాటికి టాపార్డర్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ 3 వికెట్లతో లోయర్ ఆర్డర్‌ను కూల్చాడు. మాజీ కెప్టెన్ నబీ(23), ఓపెనర్ ఇబ్రహీం జర్డాన్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లహిరు కుమార రెండు, థీక్షణ ఒక వికెట్ పడగొట్టడంతో అఫ్గనిస్థాన్ 22.2 ఓవర్లకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(56 నాటౌట్), ప్రథుమ్ నిస్సంక(51)ధాటిగా ఆడారు. నిస్సంక ఔటయ్యాక కుశాల్ మెండిస్(11 నాటౌట్)తో కరుణరత్నే కలిసి లాంఛనం పూర్తి చేశాడు.
ఇవి కూడా చదవండి
WTC Final 2023 | భరత్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగిన వార్నర్.. లంచ్ టైమ్‌కి ఆసీస్ స్కోర్..?
Team India fans | ఓవల్ స్టేడియం ఆవరణలో భారత క్రికెట్ అభిమానుల హంగామా.. జీతేగా జీతేగా, ఇండియా జీతేగా అంటూ నినాదాలు.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

