SL vs WI 3rd ODI : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(56), కుశాల్ మెండిస్(56 నాటౌట్)లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. విండీస్ బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. అయితే.. ఈ ఇద్దరి విధ్వంసంతో లంక 23 ఓ వర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారీ ఛేదనలో కరీబియన్ వీరులు ఏం చేస్తారో మరికాసేపట్లో తెలియనుంది.
పల్లెకెలె స్టేడియంలో లంక ఓపెనర్ పథుమ్ నిశాంక(56) రెచ్చిపోయాడు. నామమాత్రమైన మూడో వన్డేలో విండీస్ బౌలర్లను చితక్కొడుతూ శుభారంభమిచ్చాడు. దాంతో, లంక 81-1తో పటిష్టంగా కనిపించింది. అయితే నిశాంక, మెండిస్‌ల జోరకు వరుణుడు అడ్డుపడ్డాడు. వాన తగ్గాక అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు.
A couple of fifties lift Sri Lanka to a competitive 156 in this rain-shortened contest#SLvWI LIVE: https://t.co/Jbvf41EZf6 pic.twitter.com/LoUv9YJARK
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
దాంతో, నిశాంక, కుశాల్ మెండిస్(56)లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. అర్ధ శతకాలతో చెలరేగి జట్టు స్కోర్ 150 దాటించారు. నష్టపోయిన ఓవర్లు, లంక రన్‌రేటును దృష్టిలో పెట్టుకొని అంపైర్లు విండీస్ లక్ష్యాన్ని 195గా నిర్ణయించారు. ఇప్పటికే పొట్టి సిరీస్, వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్.. విజయంతో పర్యటనను ముగిస్తుందా? లేదా? చూడాలి.