Bear Attack | అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
బాధిత కుటుంబీకుల కథనం మేరకు.. నల్లగొండ జిల్లా కాసరాజుపల్లి గ్రామానికి చెందిన అంజయ్య కొన్ని రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలోకి మేత కోసం గొర్రెల మందను తీసుకొచ్చాడు. రోజువారీగానే శనివారం ఉదయం గొర్రెలను మేపుతున్న క్రమంలో ఎలుగుబంటి ఒక్కసారిగా అంజయ్యపై దాడి చేయగా.. తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కలవారు అంబులెన్స్‌లో అచ్చంపేట దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్ -1లో మెయిన్స్ పరీక్షల్లో మరోసారి కాపీయింగ్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు