Nikhil Choudhary : బిగ్‌బాష్ లీగ్‌తో పాపులర్ అయిన భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరీ(Nikhil Choudhary) చిక్కుల్లో పడ్డాడు. హోబర్ట్ హరికేన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్ అత్యాచార నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. మూడేండ్ల క్రితం నాటిది పేర్కొంటున్న కేసులో నిఖిల్ కోర్టు విచారణకు హాజరవుతున్నాడు. అయితే తాను అలాంటి తప్పు చేయలేదని నిఖిల్ వాదిస్తున్నాడు. దాంతో, ఫోరెన్సిక్ నిపుణులు సైతం సదరు మహిళ నిఖిల్‌పై తప్పుడు కేసు పెట్టిందని, ఆ కేసు నిలబడదని తేల్చి చెప్తున్నాడు.
అసలేం జరిగిందంటే..? ఆస్ట్రేలియాలో ఉన్న టౌన్స్‌విల్లే నైట్ క్లబ్లో నిఖిల్ తనపై అత్యాచారం చేశాడని ఒక మహిళ 2021 మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, టౌన్స్‌విల్లే (Townsvilley)జిల్లా కోర్టు ప్రస్తుతం నిఖిల్‌ను విచారిస్తోంది. నిఖిల్ తన కారులోనే ఆ మహిళను రేప్ చేశాడని, ఆమెకు తీవ్ర రక్తస్రావం అయిందని న్యాయవాది కోర్టుకు తెలిపాడు. అంతేకాదు ఆమె తల్లి కూడా తన కుమార్తె అత్యాచారానికి గురైందనే విషయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. రేప్ కేసులో నిఖిల్ చౌదరీ కోర్టు చుట్టూ తిరగడాన్ని హోబర్ట్ ఫ్రాంచైజీ సీరియస్‌గా తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.