Watch: రీల్ చేస్తున్న మహిళకు షాక్.. ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లిన బైకర్
Biker Snatches Woman’s Mangalsutra | సోషల్ మీడియా కోసం రీల్ చేస్తున్న మహిళకు బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: సోషల్ మీడియా కోసం రీల్ చేస్తున్న మహిళకు బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. (Biker Snatches Woman’s Mangalsutra) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళ అందంగా ముస్తాబైంది. రీల్ కోసం వీధిలో మెల్లగా నడుస్తున్నది.
కాగా, ఇదే అవకాశంగా భావించిన ఒక వ్యక్తి బైక్‌పై ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. అయితే చైన్ స్నాచర్‌ను అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు షాక్ నుంచి తేరుకున్న ఆ మహిళ చైన్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ మహిళ రీల్ చిత్రీకరిస్తున్న కెమెరాలో ఇది రికార్డైంది. ఈ నేపథ్యంలో ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
REEL के साइड इफैक्ट –
UP के जिला गाजियाबाद में एक महिला सड़क पर REEL बनवा रही थी। बाइक सवार बदमाश आया और चेन लूटकर फरार हो गया। pic.twitter.com/THRcfo8OiW— Sachin Gupta (@SachinGuptaUP) March 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

