Viral Video : బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హోలీ హాలిడేను సౌతిండియన్ రెసిపీలతో ఎంజాయ్ చేసింది. నటిగా ఎంత బిజీగా ఉన్నా ఇష్టమైన ఫుడ్‌ను ఆరగించడంలో ముందుండే భాగ్యశ్రీ ఆయా ఫొటోలను సోషల్ మీడియా వేదికలపై పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
ఇక హోలీని కుటుంబసభ్యులతో గడిపిన తీరు, పండుగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను భాగ్యశ్రీ తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో భాగ్యశ్రీ, ఆమె భర్త హిమాలయ దాసాని, ఇతర కుటుంబసభ్యులు సౌత్ ఇండియన్ ఘుమఘుమలను ఆస్వాదిస్తూ కనిపించారు.
వారి టేబుల్‌పై దోశెలు, మేదు వడలు, మసాలా ఇడ్లీ ఫ్రై, సాంబార్, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ కనిపించాయి. బాదంలతో కూడిన పాయసంతో వారు తమ భోజనాన్ని ముగించారు. హోలీ డే..హాలిడే..పండగ లేదా ఆదివారం రోజు ఫ్యామిలీతో ఎందుకు ఎంజాయ్ చేయకూడదని పోస్ట్‌కు భాగ్యశ్రీ క్యాప్షన్ ఇచ్చారు.
Read More :
Taapsee Pannu | బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్న తాప్సీ..?