Taapsee Pannu | బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్న తాప్సీ..?
Taapsee Pannu | తాప్సీ పన్ను (Taapsee Pannu) పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బో (Mathias Boe)ను రహస్యంగా పెళ్లాడినట్లు సమాచారం (married).
Taapsee Pannu | సౌత్, నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu). బాలీవుడ్లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ముందు వరుసలో ఉంటుంది. తెర బయట సైతం ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంటుందన్న పేరుంది ఆమెకు. కాగా, తాజాగా ఈ పంజాబీ భామ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బో (Mathias Boe)ను రహస్యంగా పెళ్లాడినట్లు సమాచారం (married).
మార్చి 23న ఉదయ్‌పూర్‌లో ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మార్చి 20న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే వీరి వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఈ కొత్త జంట త్వరలో ముంబైలో తమ స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్లు సమాచారం.
తాప్సీకి అత్యంత సన్నిహితులు షేర్ చేసిన ఫొటోలు వీరి పెళ్లి వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. వారు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు పెళ్లి విషయంపై తాప్సీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
కాగా, మాథియాస్ బోతో తన ప్రేమ గురించి తాప్సీ ఇటీవలే బయట పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి మాథియాస్ బోతో ప్రేమలో ఉన్నానని చెప్పింది. ‘దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయమైంది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. అయితే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. మాథియాస్ బోతో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ రాలేదు’ అని చెప్పుకొచ్చింది తాప్సీ.
మరోవైపు షారుఖ్‌ఖాన్‌తో జోడీగా తాప్సీ నటించిన ‘డంకీ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సక్సెస్ జోష్‌లో తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నది తాప్సీ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Also Read..
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ..!
Indian student | లండన్ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి
Kangana Ranaut | హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగన రనౌత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

