JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ..!
JP Nadda | భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) భార్య కారు చోరీకి గురైంది (Toyota Fortuner Stolen).
JP Nadda | భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) భార్య కారు చోరీకి గురైంది (Toyota Fortuner Stolen). ఢిల్లీలో గల గోవింద్‌పురి ప్రాంతంలో కారు అపహరణకు గురైనట్లు సమాచారం. మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కారు చోరీకి గురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
సదరు కథనాల ప్రకారం.. తెల్లటి టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ జోగీందర్ సర్వీసింగ్ కోసం తీసుకెళ్లాడు. సర్వీసింగ్ అనంతరం కారును నడ్డా నివాసానికి తీసుకొస్తున్నాడు. మార్గం మధ్యలో తన నివాసం వద్ద భోజనం చేసేందుకు కారును ఆపాడు. కారును ఇంటి ముందు ఆపి భోజనం చేసి వచ్చే సరికి కారు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కారుకోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. కారును గురుగ్రామ్ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన కారు హిమాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకూ కారు ఆచూకీ మాత్రం తెలియరాలేదని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Kangana Ranaut | హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగన రనౌత్
Janardhana Reddy | సొంత గూటికి గనుల వ్యాపారి.. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి
Indian student | లండన్ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

