Nicholas Pooran : వెస్టిండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(Nicholas Pooran) పొట్టి క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఈ విధ్వంసక బ్యాటర్ టీ20 ఫార్మాట్లో 100 సిక్సర్లు బాదాడు. శనివారం ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో గస్ అట్కిన్సన్(Gus Atkinson) వేసిన ఐదో ఓవర్లో సిక్సర్ కొట్టిన అతడు ఈ ఫీట్ సాధించాడు. తద్వారా 100 సిక్సర్ల మైలురాయికి చేరిన 16వ క్రికెటర్గా, మూడో కరీబియన్ ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు.
పూరన్ కంటే ముందు విండీస్ తరఫున యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(Chirs Gayle), డాషింగ్ ఓపెనర్ ఎవిన్ లెవిస్(Evin Lewis) టీ20ల్లో 100 సిక్సర్లు బాదారు. లెవిస్ 48 ఇన్నింగ్స్లో, గేల్ 49 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్
ఇక భారత జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ కొలిన్ మున్రో 57 ఇన్నింగ్స్లో, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్ ఫించ్ 70వ ఇన్నింగ్స్లో 100 సిక్సర్లు బాదారు.