Aishwarya Rai | అభిషేక్ బచ్చన్‌తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్
Aishwarya Rai | బాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు. అయితే ఈ జంట విడిపోనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి.
బాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు. అయితే ఈ జంట విడిపోనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అమితాబ్‌బచ్చన్ ‘అంతా అయిపోయింది’ అనే అర్థం వచ్చేలా చేసిన ట్వీట్ అభిషేక్ బచ్చన్ దంపతులు విడాకుల రూమర్స్‌కు ఆజ్యం పోసింది. ఐశ్యర్యరాయ్ సోషల్ మీడియా ఖాతాలను అమితాబ్ అన్‌ఫాలో చేశారని మీడియాలో కథనాలొచ్చాయి.
ఈ నేపథ్యంలో అభిషేక్-ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ రూమర్స్ అన్నింటికి తన తాజా వీడియోతో చెక్ పెట్టింది ఐశ్వర్యరాయ్. ముంబయిలో జరిగిన ఓ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో అమితాబ్‌బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ కలిసి పాల్గొన్నారు. ముగ్గురూ సరదాగా నవ్వుతూ కనిపించారు. ఇదే ఈవెంట్లో అమితాబ్‌బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి స్టేజీ మీద నృత్యం చేశారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పడినట్లయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

