Tollywood | ఒక బెంగాలీ.. తెలంగాణ సినిమా పితామహుడు ఎలా అయ్యాడు?
Tollywood | హైదరాబాదులో సినిమాల నిర్మాణం నిజాం చొరవ వల్లనే జరిగింది. ఇందుకు సినిమా టెక్నీషియన్లు, వ్యాపారులు కృషిచేశారు. కానీ వారు స్థానికేతరులు కావడం వల్ల ఇక్కడ ఎంతో కాలం ఉండలేకపోయారు. అయితే హైదరాబాదులో నిజాం సినిమాలతో సాంస్కృతికపరమైన ముందడుగు వేయాలనుకున్నారు.
Tollywood | హైదరాబాదులో సినిమాల నిర్మాణం నిజాం చొరవ వల్లనే జరిగింది. ఇందుకు సినిమా టెక్నీషియన్లు, వ్యాపారులు కృషిచేశారు. కానీ వారు స్థానికేతరులు కావడం వల్ల ఇక్కడ ఎంతో కాలం ఉండలేకపోయారు. అయితే హైదరాబాదులో నిజాం సినిమాలతో సాంస్కృతికపరమైన ముందడుగు వేయాలనుకున్నారు. తమకున్న ఆధునిక ఆలోచనలు, బ్రిటిష్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యం జోడించి సినిమాలతో తన స్థాయిని పెంచుకోవాలనుకున్నారు. అయితే ధీరేన్ గంగూలీ దృష్టిలో కలకత్తాలో కన్నా హైదరాబాదులో మూకీల నిర్మాణానికి అనుకూలమైన, మెరుగైన వనరులున్నా, ఇక్కడి రాజకీయ సామాజిక పరిస్థితులు సినిమా రంగాన్ని ముందుకు సాగనివ్వలేదు.
ధీరేన్ గంగూలీ హైదరాబాదు స్టేట్‌లో నటునిగా, సినీ పరిశ్రమ వ్యవస్థాపకునిగా, మేకప్‌మెన్, సినీ ఎగ్జిబిటర్, పంపిణీదారునిగా బహుముఖీనంగా తన పాత్ర పోషించారు. వీటితోపాటు స్త్రీలను సినిమాలో చూపించటానికి ఒప్పించటంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. తన సినిమాలకు సోదరుని ఆర్థిక సహాయం తీసుకోవడమేగాక, తన భార్యను మూకీలలో నటింపజేశారు. ధీరేన్ గంగూలీ హైదరాబాదులో ఉన్నది సుమారు రెండేళ్ళు మాత్రమే. కానీ ఆయన తెలంగాణలో మూకీ సినిమాల నిర్మాణానికి ఆద్యుడుగా నిలిచాడు. ఆ విధంగా తెలంగాణ సినిమా పితామహుడైనారు. ధీరేన్ గంగూలీ బెంగాలీవాడు కదా! తెలంగాణ సినిమాకు పితామహుడెట్ల అవుతాడు? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అతను ఎక్కడివాడైనా కావచ్చు. కానీ సినిమాలు తీసింది తెలంగాణ గడ్డమీద కనుక అతడిని తెలంగాణ సినిమాకు పితామహునిగా కీర్తించడంలో ఎలాంటి తప్పులేదు. పైగా తన జాతికి ఎవరు సేవచేసినా తలకెత్తుకునే తత్వం తెలంగాణది.
(‘లోటస్ ఫిలిం కంపెనీ – హైదరాబాదు’ పుస్తకం నుంచి. రచన : హెచ్. రమేశ్‌బాబు)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

