కేవీపీకి రెడ్‌కార్నర్ నోటీసుపై కౌంటర్లు దాఖలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి సంబంధించిన ముడుపుల వ్యవహారంలో కేవీపీ రామచంద్రరావుకు జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి సంబంధించిన ముడుపుల వ్యవహారంలో కేవీపీ రామచంద్రరావుకు జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. టైటానియం ప్రాజెక్టు కుంభకోణంలో ఇంటర్‌పోల్ జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసు, ప్రొవిజనల్ అరెస్టు వారెంట్‌పై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ 2014లో కేవీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు.
సీబీఐ తరఫు న్యాయవాది టీ సృజన్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. టైటానియం ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు 18.5 మిలియన్ డాలర్ల ముడుపులు చెల్లించిన వ్యవహారంపై అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నార్త్ ఇల్లినాయిస్ కోర్టులో కేసు నమోదు చేసిందని, దీని ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిందని తెలిపారు.
కేవీవీ తరఫు సీనియర్ న్యాయవాది ఎన్ హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెడ్‌కార్నర్ నోటీసుపై సీబీఐ తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదని చెప్పారు. దీనిపై స్పందించాల్సింది కేంద్రమేనని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖతోపాటు విదేశీ వ్యవహారాలశాఖను ప్రతివాదిగా చేర్చామని వివరించారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

