సాస్ భూస్వాహాపై సమాధానమేంది?
‘హైదరాబాద్ ఖాజాగూడలో బెంగళూరుకు చెందిన ‘సాస్ ఇన్ఫ్రా’ కంపెనీ 3.17 ఎకరాల భూమిని కొల్లగొట్టింది నిజంకాదా? బల్మూరి వెంకట్.. డొంకతిరుగుడు మాటలొద్దు..సూటిగా సమాధానం చెప్పు?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ ప్రశ్నించారు.
- బల్మూరీ.. సమాధానం చెప్పు!
- ఆధారాల్లేకుండా కేటీఆర్‌పై, సంతోష్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకోం
- ‘నమస్తే తెలంగాణ’ ప్రజల గుండె చప్పుడు: చిరుమల్ల రాకేశ్
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ ఖాజాగూడలో బెంగళూరుకు చెందిన ‘సాస్ ఇన్ఫ్రా’ కంపెనీ 3.17 ఎకరాల భూమిని కొల్లగొట్టింది నిజంకాదా? బల్మూరి వెంకట్.. డొంకతిరుగుడు మాటలొద్దు..సూటిగా సమాధానం చెప్పు?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ ప్రశ్నించారు. ఆ కంపెనీ అక్రమ వ్యవహారంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఆధారాలు చూపాలి’ అని సవాల్ విసిరారు.
‘అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా? అన్ని వ్యవస్థలు మీ దగ్గరే ఉన్నయి కదా? విచారణ జరిపించి వాస్తవాలు బట్టబయలు చేయాలి.. అంతేగానీ బీఆర్ఎస్ నేతలపై బట్టకాల్చి మీదేస్తే ఊరుకొనేది లేదు’ అని హెచ్చరించారు. సాస్ కంపెనీ భూ బాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం వాస్తవమని స్పష్టంచేశారు. అన్ని ఆధారాలతోనే సదరు కంపెనీ భూ దోపిడీని బట్టబయలు చేసిందని తేల్చిచెప్పారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై పెట్టిన కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.
నాడు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న బల్మూరి వెంకట్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని దుయ్యబట్టారు. బల్మూరి వెంకట్ కాస్తా బూతుల వెంకట్‌గా మారాడని దెప్పిపొడిచారు. భార్యను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయం చేసి మూడువేల ఓట్లు తెచ్చుకున్న ఆయన.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ప్రజల గొంతుక ‘నమస్తే’
నిరంతరం ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడని చిరుమల్ల వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు కేసీఆర్ ఆ పత్రికకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రజల ఆర్తి, ఆవేదనను ప్రపంచానికి చాటిచెప్తున్నదని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి గుమస్తాగా మారిన బల్మూరి ‘నమస్తే’పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
బల్మూరి ఆధారాల్లేకుండా కేటీఆర్, సంతోష్‌కుమార్‌కు కంపెనీలో వాటాలున్నాయని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ‘వారికి వాటాలుంటే అక్రమాలను ఎలా వెలుగులోకి తెస్తారు? అసలు బల్మూరికి మతి భ్రమించిందా? రేవంత్ మెప్పుకోసం ఇంతగా దిగజారాలా?’ అని ప్రశ్నించారు. మరోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్ర భుత్వం కూల్చివేస్తున్నదని ఆరోపించారు. కూ ల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కోర్టులంటే లెక్కలేదా?: గౌతం ప్రసాద్
కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి బల్మూరి వెంకట్ మరోసారి నోరుపారేసుకోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత గౌతం ప్రసాద్ ధ్వజమెత్తారు. దూదిమెట్ల బాలరాజు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టంచేశారు. బాలరాజు యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

