ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్(ఐపీఈ) నూతన డైరెక్టర్‌గా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్(ఐపీఈ) నూతన డైరెక్టర్‌గా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. అటానమస్ సంస్థ అయిన ఐపీఈ డైరెక్టర్‌గా నియమితులైన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు.
అంతకుముందు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)కన్వీనర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. లింబాద్రి సేవలు గుర్తించి గత కేసీఆర్ సర్కార్ ఆయన్ను ఉన్నత విద్యామండలికి తొలి దళిత చైర్మన్‌గా నియమించింది. లింబాద్రి ప్రస్తుతం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీకి అంబుడ్స్పర్సన్గా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల సీఈవోగా పనిచేస్తున్నారు. ఐపీఈ డైరెక్టర్‌గా పరిశోధనా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని లింబాద్రి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

