Xara Jetly : ప్రపంచ క్రికెట్లో అథ్లెట్‌ను తలపించే విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఫ్యాన్స్ ఎక్కువే. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సొగసైన ఆటతో పాటు మైదానంలో దూకుడుతో ఈతరం క్రికెటర్లకు ఆరాధ్యుడైన కోహ్లీని ఇష్టపడని వారుండరు. తాజాగా అతడి ఫ్యాన్ క్లబ్లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ చేరింది. కివీస్ స్పిన్నర్ అయిన క్జర జెట్లీ (Xara Jetly ) భారత స్టార్‌తో ఫొటో దిగాలని ఆశపడుతోంది.
వరల్డ్ క్లాస్ బ్యాటర్ కోహ్లీతో ఇన్స్టాగ్రామ్ ఫొటో దిగాలని ఆశపడుతున్నాని ఆమె తెలిపింది. దేశవాళీలో వెల్లింగ్టన్ బ్లేజ్ జట్టుకు ఆడుతున్న జెట్లీ తాజాగా ఫైన్ లెగ్స్ ది క్రికెట్ పోడ్కాస్ట్లో మాట్లాడింది. ఆ సందర్భంగా ఆమె కోహ్లీపై అభిమానాన్నిచాటుకుంది. ‘మహిళల క్రికెట్ మ్యాచుల్లో నేను సూపర్‌గా బౌలింగ్ చేస్తాను. ఇక పురుషుల క్రికెట్లో నాకు కోహ్లీకి బౌలింగ్ చేయాలని ఉంది. ఒకవేళ అతడితో ఓ ఫొటో దిగితే దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతా. నా లక్ష్యమదే’ అని 22 ఏండ్ల జెట్లీ తెలిపింది.
Here’s the video of Xara Jetly (one of the most beautiful woman cricketer) talking about his favourite GOAT VIRAT KOHLI.🐐❤️ pic.twitter.com/9vKzwP4SSF
— Vahini🕊️ (@fairytaledustt_) August 19, 2024
అంతేకాదు ‘విరాట్ కోహ్లీ, నేను కచ్చితంగా చక్కని ఇన్స్టాగ్రామ్ ఫొటో దిగుతాం. నా మాటలు గుర్తు పెట్టుకోండి’ అని తన ఎక్స్ ఖాతాలో ఈ యువకెరటం రాసుకొచ్చింది. దేశవాళీలో రాణిస్తున్న జెట్లీ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటివరకూ ఆమె 11 మ్యాచుల్లో 3.71 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టింది.
కోహ్లీ విషయానికొస్తే.. ఈమధ్యే ఈ లెజెండరీ ఆటగాడు టీ20 వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. అనంతరం శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఆడినా.. తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతానికి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్టు సిరీస్ సన్నద్ధతలో విరాట్ ఉన్నాడు.