WTC 2024-25 : సొంతగడ్డపై ఎదురులేని టీమిండియా (Team India)కు దిమ్మదిరిగే షాకిచ్చింది న్యూజిలాండ్. చిన్నస్వామి స్టేడియంలో ఆల్‌రౌండ్ షోతో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్.. అనంతరం 107 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. దాంతో, బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ వైట్‌వాష్ చేసిన రోహిత్ సేనకు గర్వభంగం అయింది. అంతేకాదు సూపర్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25)లో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. మరోవైపు ఊహించని విధంగా ఓటమి పాలైన టీమిండియా మాత్ర అగ్రస్థానం కాపాడుకుంది.
ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన భారత్.. మూడోసారి కూడా రేసులో ఉంది. బంగ్లాను 2-0తో వైట్‌వాష్ చేసి ఫైనల్ అవకాశాల్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే.. న్యూజిలాండ్ ఇచ్చిన షాక్‌తో టీమిండియా ర్యాంకుకు ఎసరు వచ్చేలా ఉంది. అయితే.. బెంగళూరులో ఓడినా సరే బేఫికర్ అన్నట్టు టాప్‌లోనే ఉంది. కానీ, తర్వాతి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ బృందం భారీ తేడాతో గెలిస్తే తప్ప డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగువపడవు.
New Zealand’s win in first #INDvNZ Test shakes up the #WTC25 standings 👀
More ➡️ https://t.co/aGNt1GAOJA pic.twitter.com/FmuwwDwTyZ
— ICC (@ICC) October 20, 2024
ఇక శ్రీలంక చేతిలో 2-0తో టెస్టు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు తొలి టెస్టు విజయం కలిసొచ్చింది. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో దిగజారిన కివీస్‌కు ఈ గెలుపు ఆక్సిజన్‌లా కొత్త ఊపిరి పోసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో న్యూజిలాండ్ రెండు స్థానాలు పైకి ఎగబాకింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను దాటేసి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ నంబర్ 1లో ఉండగా.. ఆస్ట్రేలియా, శ్రీలంకలు వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.
A memorable win for New Zealand as they take a 1-0 lead in the #WTC25 series against India 👊#INDvNZ | 📝 Scorecard: https://t.co/Ktzuqbb61r pic.twitter.com/sQI74beYr8
— ICC (@ICC) October 20, 2024