CNG Price | సీఎన్జీ వాహనదారులకు త్వరలో షాక్ తగలబోతున్నది. రాబోయే రోజుల్లో సీఎన్జీ ధర రూ.4 నుంచి రూ.6 వరకు పెరగనున్నది. అయితే, ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెరుగుతున్న సీఎన్జీ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సంబంధితర వర్గాలు పేర్కొన్నాయి. సీఎన్జీ సరఫరాలో ప్రభుత్వం 20శాతం కోత విధించింది. న్యాచురల్ గ్యాస్ భారత్‌లోని అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు భూగర్భం, సముద్ర గర్భం నుంచి పైపుల ద్వారా సరఫరా అవుతున్నది. సీఎన్జీ ఓ రకమైన ముడిపదార్థం. ఆటోమొబైల్స్, ఇండ్లలో వంట గ్యాస్‌ని ఉపయోగించేందుకు సీఎన్జీగా మారుస్తారు. గెలసీ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ నగరాల్లోని రిటైల్ గ్యాస్ సరఫరాదారులకు పంపిస్తారు. ఈ గ్యాస్ సరఫరాలో ఏటా ఐదుశాతం కోత విధిస్తూ వస్తున్నారు.
దేశీయ వంటగ్యాస్ సరఫరా నిలకడగా ఉన్నది. దాంతో పెరిగే అవకాశం లేదు. కానీ, సరఫరాదారులు తక్కువగా సరఫరా అవుతున్నందున సీఎన్జీని కొనుగోలు ఖరీదుకానున్నది. దాంతోనే రాబోయే రోజుల్లో ధరలు పెరగనున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం జీఎన్జీపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ముంబయి, ఢిల్లీతో పాటు పలు నగరాల్లోనూ సీఎన్జీపై ఆధారపడి వాహనాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ధరల ప్రభావం ఓటర్లపై ప్రభావం పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుందని.. ఈ క్రమంలోనే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచనలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.