NZW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏలో రెండో సెమీస్ స్థానం ఖరారైంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan)ను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్ (Newzealand) దర్జాగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట కివీస్‌ను తక్కువకే కట్టడి చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో విఫలమైంది. 11.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించాలనే తొందరలో టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. జట్టుకు ఓటమి తప్పించేందుకు కెప్టెన్ ఫాతిమా సనా(21) చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆమె 9వ వికెట్‌గా ఔటైనా కాసేపటికే పాక్ 56 పరుగులకు ఆలౌట్ అయింది. అక్కడితో.. పాక్ ఏదైనా అద్భుతం చేయకపోతుందా? భారత్ సెమీస్ ఆడకపోతుందా? అనే ఆశలు పెట్టుకున్న అభిమానులు ఊసురుమన్నారు.
సెమీస్ ఆశలు సంక్లిష్టంగా ఉన్న దశలో పాక్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దాంతో, కివీస్ అతికష్టమ్మీద 110 పరుగులు చేయగలిగింది. అనంతరం ఛేదనలో పాక్ ఆది నుంచి తడబడింది. 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే సెమీస్ అవకాశం ఉన్నందున ఓపెనర్లు మునీబా అలీ(15), సిద్రా అమిన్(0)లు ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు. ఆ తర్వాత కార్ల్సన్ దెబ్బ కొట్టింది. అయితే.. కెప్టెన్ ఫాతిమా సనా(21), నిడా దార్(9)లు జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ.. అమేలియా కేర్(3/14) సంచలన ప్రదర్శనతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. దాంతో.. వరుసగా వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్ చేరారు.
New Zealand seal semi-final spot with a thumping win over Pakistan 🇳🇿👌#WhateverItTakes #PAKvNZ
📝: https://t.co/TCPW5fDBHI pic.twitter.com/3GDf4lnrk1
— ICC (@ICC) October 14, 2024
టీమిండియాపై విరుచుకుపడిన న్యూజిలాండ్ బ్యాటర్లు కీలక పోరులో బ్యాట్లెత్తేశారు. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ తీసుకోగా.. ఓపెనర్లు సూజీ బేట్స్(28), జార్జియా ప్లిమ్మర్(17)లు పవర్ ప్లేలో ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే.. ఈ జోడీని నష్ర సంధు (318) విడదీసి పాక్‌కు బ్రేకిచ్చింది. మొదట ప్లిమ్మెర్ను ఔట్ చేసిన సంధు.. ఆ కాసేపటికే డేంజరస్ బేట్స్‌ను పెవిలియన్ పంపింది. అక్కడితో కివీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది.
Through to the semi-finals in style 🤩
New Zealand become the second team after Australia to make the final four of the Women’s #T20WorldCup 2024 🔥#PAKvNZ #WhateverItTakes pic.twitter.com/TRur6jHETT
— ICC (@ICC) October 14, 2024
ఆ దశలో కెప్టెన్ సోఫీ డెవినె(19), బ్రూక్ హల్లిడే(22)లు పట్టుదలగా ఆడారు. కానీ, పాక్ బౌలర్లు బౌండరీలు అస్సలు ఇవ్వలేదు. ఫీల్డింగ్‌లోనూ చురకుదనంతో కివీస్‌ను ఒత్తిడిలో పడేశారు. స్పిన్ సమర్ధంగా ఆడే డెవినె భారీ షాట్ ఆడబోయి 19వ ఓవర్లో చివరకు ఔట్ అయింది. ఆ ఓవర్ ఆఖరి బంతికి కివీస్ స్కోర్ 100 దాటింది. 20 వ ఓవర్లో నిడా దార్ మ8 పరుగులే ఇవ్వడంతో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది.