Ruth Chepngetich : మరాథాన్ పరుగు అంటే చాలు ఆఫ్రికా దేశాల అథ్లెట్లదే అగ్రస్థానం. విశ్వ క్రీడల నుంచి ఇతర పోటీల్లోనూ సుదీర్ఘ పరుగు పందెంలో వాళ్లే ఎక్కువగా విజేతలుగా నిలుస్తుంటారు. తాజాగా కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్ (Ruth Chepngetich) సరికొత్త చరిత్ర సృష్టించింది. చికాగో మారథాన్ (Chicago Marathon) 42.19 కిలోమీటర్ల పందెంలో బరిలోకి దిగిన ఆమె ట్రాక్ మీద తన సత్తువకు తిరుగులేదని చాటుతూ వరల్డ్ రికార్డు బద్ధలు కొట్టింది. అది కూడా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోకుండానే ఆమె రికార్డు బ్రేక్ చేయడం విశేషం.
సోమవారం జరిగిన చికాగో మారథాన్ పోటీల్లో 30 ఏండ్ల రుత్ సత్తా చాటింది. పట్టువదలని యోధురాలిలా దౌడు తీసిన ఆమె 2:09:56 గంటల్లో లక్ష్యాన్ని చేరుకుంది. అంతే ప్రపంచ రికార్డు ఆమెకు దాసోహం అయింది. రెండు నిమిషాల తేడాతో రుత్ సరికొత్త చాంపియన్గా రికార్డు పుస్తకాల్లో తన పేరు పదిలం చేసుకుంది.
WORLD RECORD ‼️
🇰🇪’s Ruth Chepngetich destroys the marathon world record in Chicago with an incredible 2:09:57 😮💨
That’s almost 2 minutes faster than the previous world record 🤯
She finishes in 10th place overall of the @ChiMarathon 👏 pic.twitter.com/ftM1J0j1F1
— World Athletics (@WorldAthletics) October 13, 2024
గతంలో టిగిస్ట్ అస్సెఫా(ఇథియోపియా) పేరిట ఉన్న 2:11:53 గంటల రికార్డును రుత్ బ్రేక్ చేసింది. నిరుడు బెర్లిన్ మారథాన్లో అసెఫా ఈ రికార్డు నెలకొల్పాడు. మట్టిలో మాణిక్యాలకు నెలవైన ఆఫ్రికా నుంచి రుత్ సంచలనాల పర్వం లిఖిస్తోంది. చికాగో మారథాన్లో ఈ కెన్యా కెరటం విజేతగా నిలవడం ఇదే మొదటిసారి కాదు. వరుసగా 2021, 2022లో ఆమె చాంపియన్ అయింది. ఇక 2023 ఎడిషన్లో రుత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ‘నా పేరు రుత్ చెప్నేగెటిక్. నాకు కోచ్ లేడు. నాకు నేనే కోచ్’ అని చారిత్రక పరుగు అనంతరం మీడియా సమావేశంలో రుత్ సగర్వంగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా ఆమె చప్పట్లతో అభినందనలు తెలిపారు.
“Me, as Ruth Chepngetich, I don’t have a coach. I am self-coached.”
Kenya’s Ruth Chepngetich clarified that she has been self-coached since the start of her professional career. She just coached herself to a 2:09:56 world record.
She trains in Ngong, Kenya with a group of… pic.twitter.com/jpVCrDcWQk
— Chris Chavez (@ChrisChavez) October 13, 2024