NZW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా (Australia) దర్జాగా సెమీస్ చేరింది. ఇక రెండో స్థానం కోసం న్యూజిలాండ్ (Newzealand) ఇవాళ పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఆసీస్ చేతిలో చిత్తైన కివీస్ సెమీస్ చేరేందుకు పాక్‌ను ఓడిస్తే సరి. అదే జరిగితే భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఒకవేళ పాక్ అమ్మాయిలు అద్భుతం చేసి.. న్యూజిలాండ్‌కు చెక్ పెడితే టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.
సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవిన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకుంది. బలమైన బౌలింగ్ యూనిట్ గల పాక్ ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేయాలని భావిస్తోంది. తండ్రి అంత్యక్రియల కోసం స్వదేశం వెళ్లొచ్చిన కెప్టెన్ ఫాతిమా సనా జట్టుతో కలవడం పాక్‌కు పెద్ద బలం కానుంది.
Three teams aiming for one SF spot – this result decides it all 🍿
FOLLOW: https://t.co/xaV3a7yGin | #T20WorldCup pic.twitter.com/Nt4LQarDcS
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2024
న్యూజిలాండ్ జట్టు : సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కేర్, సోఫీ డెవినె(కెప్టెన్), బ్రూక్ హల్లిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గజే(వికెట్ కీపర్), రొస్‌మెరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జొనాస్.
పాకిస్థాన్ జట్టు : మునీబా అలీ(వికెట్ కీపర్), సిద్రా అమిన్, సదాఫ్ షమాస్, నిదా దార్, ఒమైమా సొహైల్, అలియా రియాజ్, ఫాతిమా సనా(కెప్టెన్), ఇరామ్ జావేద్, సైదా అరూబ్ షామ్, నష్రా సంధు, సదియా ఇక్బాల్.