లక్నో: దసరా రోజున రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాముడు, రావణుడు పాత్ర ధారులు తొలుత బాణాలతో యుద్ధం చేస్తున్నట్లుగా నటించారు. ఆ తర్వాత వారిద్దరూ భౌతికంగా కొట్టుకున్నారు. (Ram, Ravana Engage In Fight) దీంతో గందరగోళం చెలరేగడంతో ఆ నాటక ప్రదర్శన ఆగిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విజయదశమి సందర్భంగా గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్ గొన్సాయి గ్రామంలో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చివర భాగంలో రామ, లక్ష్మణులు రావణుడితో యుద్ధం చేశారు. తొలుత ఒకరిపై ఒకరు బాణాలు వేసుకున్నారు. ఇంతలో రాముడి పాత్రధారుడ్ని రావణ పాత్రధారుడు స్టేజ్ నుంచి కిందకు తోశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కోట్లాట జరిగింది. అక్కడున్న వారు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరిని విడిపించారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఆ నాటకం ప్రదర్శన ఆగిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మరోచోట జరిగిన రామ్లీలా ప్రదర్శనలో రాముడు, హనుమంతుడు వేషం వేసిన వ్యక్తులు వేదికపై కొట్టుకున్నారు. రామాయణంలో ఒక ఘట్టం సందర్భంగా లక్ష్మణుడు మూర్చపోతాడు. సోదరుడ్ని పరిశీలిస్తున్న రాముడ్ని, హనుమంతుడు వేషధారుడు కాలితో తన్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కొట్టుకున్నారు. చివరకు అక్కడున్న వ్యక్తులు వారిని విడిపించి సర్దిచెప్పారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अमरोहा, यूपी में रामलीला मंचन में राम–रावण रियल में भिड़ गए। रावण ने राम को धक्का दे दिया। लोगों ने स्टेज पर पहुंचकर बीच–बचाव कराया। pic.twitter.com/itoIBtcQjp
— Sachin Gupta (@SachinGuptaUP) October 14, 2024
Ye Ramleela thodi personal ho gayi…. pic.twitter.com/vCKEu3aSOW
— Random Guy 🇮🇳 (@_____Random_Guy) October 13, 2024