Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. వెట్టైయాన్ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చింది.
వెట్టైయాన్ ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.240 కోట్ల (4 రోజులు)గ్రాస్ సాధించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అండ్ టీం తలైవాను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. మొత్తానికి తలైవా మేనియాతో వెట్టెయాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంటెన్స్ క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటించారు.
వెట్టైయాన్ను లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కించారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
#Vettaiyan – 240cr in 4 Days for an Intense Crime Investigation Thriller Genre is such a Big thing..🔥 Superstar #Rajinikanth Stardom made it Possible.. ⭐ pic.twitter.com/nspEAGQ1mF
— Laxmi Kanth (@iammoviebuff007) October 14, 2024
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్