NZW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి సెమీస్ రేసులో వెనకబడిన పాకిస్థాన్ బంతితో రఫ్పాడించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. పాక్ స్పిన్నర్లు పొదుపుగా, కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ టాప్ బ్యాటర్లు సైతం పరుగులు చేయలేపోయారు. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా మిడిలార్డర్‌ను నష్ర సంధు (3/18)దెబ్బకొట్టింది. ఒకదశలో 100 కొట్టుడే కష్టమనుకున్న కివీస్‌ను బ్రూక్ హల్లిడే(22), కెప్టెన్ సోఫీ డెవినె(19)లు ఆదుకున్నారు. దాంతో, న్యూజిలాండ్ 6 పోరాడలిగే స్కోర్ చేయగలిగింది.
టీమిండియాపై విరుచుకుపడిన న్యూజిలాండ్ బ్యటర్లు కీలక పోరులో బ్యాట్లెత్తేశారు. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ తీసుకోగా.. ఓపెనర్లు సూజీ బేట్స్(28), జార్జియా ప్లిమ్మర్(17)లు పవర్ ప్లేలో ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే.. ఈ జోడీని నష్ర సంధు (3/18) విడదీసి పాక్‌కు బ్రేకిచ్చింది. మొదట ప్లిమ్మెర్ను ఔట్ చేసిన సంధు.. ఆ కాసేపటికే డేంజరస్ బేట్స్‌ను పెవిలియన్ పంపింది. అక్కడితో కివీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది.
WICKET – Nashra Sandhu is at it again 🔥
Pakistan are coming back into this!
FOLLOW: https://t.co/xaV3a7y8sP | #T20WorldCup pic.twitter.com/kSUuPvwqo6
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2024
ఆ దశలో కెప్టెన్ సోఫీ డెవినె(19), బ్రూక్ హల్లిడే(22)లు పట్టుదలగా ఆడారు. కానీ, పాక్ బౌలర్లు బౌండరీలు అస్సలు ఇవ్వలేదు. ఫీల్డింగ్‌లోనూ చురకుదనంతో కివీస్‌ను ఒత్తిడిలో పడేశారు. అతికష్టమ్మీద ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు.
స్పిన్ సమర్ధంగా ఆడే డెవినె భారీ షాట్ ఆడబోయి 19వ ఓవర్లో చివరకు ఔట్ అయింది. ఆ ఓవర్ ఆఖరి బంతికి కివీస్ స్కోర్ 100 దాటింది. 20 వ ఓవర్లో నిడా దార్ మ8 పరుగులే ఇవ్వడంతో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది.