కోల్‌కతా: బైక్ రేస్ శృతిమించింది. (Bike Race) రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్ని వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 11న అర్ధరాత్రి వేళ కొందరు బైకర్లు రేసింగ్ పోటీలు నిర్వహించారు. రోడ్డుపై అతి వేగంగా బైక్‌లు నడిపారు.
కాగా, హుగ్లీలోని పోల్బార్ రాజ్‌ఘాట్ ఇంటర్సెక్షన్ వద్ద ఒక ఎస్యూవీ మలుపు తిరిగింది. ఒక బైకర్ ఆ వాహనం ముందు నుంచి దూసుకుపోయాడు. దాని వెనుక వేగంగా వచ్చిన మరో బైక్ ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి పెద్ద పేలుడు సంభవించడంతోపాటు మంటలు చెలరేగాయి.
మరోవైపు ఆ బైక్‌ను నడిపిన వ్యక్తి, వెనుక కూర్చొన్న మరో వ్యక్తి మంటల్లో కాలిపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని పక్కకు లాగేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అనంతరం కాలిన గాయాలతో వారిద్దరూ మరణించారు. బొలెరో వాహనంలో ఉన్న వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A group of bikes were riding together at midnight, and two of them seemed to be racing. Unfortunately, one bike collided with a vehicle, catching fire instantly. #roadsafety #safetyfirst #rushlane pic.twitter.com/JsdfzuLiX2
— RushLane (@rushlane) October 14, 2024