T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) స్క్వాడ్‌ను ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3న మొదలయ్యే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. సోఫీ డెవినె (Sophie Devine) కెప్టెన్‌గా వ్యవహరించనుందని మంగళవారం న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది.
డెవిన్తో పాటు సీనియర్ ప్లేయర్ సుజీ బేట్స్లు తొమ్మిదో వరల్డ్ కప్ ఆడబోతున్నారు. గాయం నుంచి కోలుకున్నపేసర్ రోస్మెరీ మైర్(Rosemary mair), ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెర్క్లు వరల్డ్ కప్ బెర్తు దక్కించుకున్నారు. ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ గ్రూప్ ‘ఏ’లో ఉంది. అదే గ్రూప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, శ్రీలంకలు ఉన్నాయి.
న్యూజిలాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్ : సోఫీ డెవినె(కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్(వికెట్ కీపర్), మడ్డీ గ్రీన్, బ్రూకె హల్లిడే, ఫ్రాన్ జొనాస్, లీగ్ కాస్పెర్క్, జెస్ కెర్, మెలీ కెర్, రోస్మెరీ మైర్, మొల్లి పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మెర్, హన్నాహ్ రొబే, లీ తహుహు.
మెగా టోర్నీకి ముందు కివీస్ జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత దక్షిణాఫ్రికా, అనంతరం ఇంగ్లండ్ జట్లను న్యూజిలాండ్ ఢీకొట్టనుంది. వరల్డ్ కప్ ఆరంభ పోరులో అక్టోబర్ 4వ తేదీన భారత్‌తో కివీస్ తలపడనుంది. పొట్టి వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా(Australia)తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకూ ఈ సిరీస్ జరుగనుంది.