Raj Tarun | టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్ (Raj Tarun)-లావణ్య (lavanya) కేసు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన లావణ్య సమర్పించిన ఆధారాలతో.. ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన పోలీసులు రాజ్‌తరుణ్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసి నిందితుడిగా చేర్చారు. మరోవైపు ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నాడు.
మరో ట్విస్ట్ నెలకొంది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాపై పీఎస్‌లో లావణ్య నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారం చోరీ జరిగిందని.. బంగారం, పుస్తెలతాడు, తాళిబొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని లావణ్య ఆరోపించింది. పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నించాడని ఆరోపించిన లావణ్య తాళితోపాటు డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది.
బంగారం కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్‌తో సహా పీఎస్‌కు వచ్చిన లావణ్య.. తన నగలు బీరువాలో దాచానని, ఆ బీరువా తాళపు చెవి రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయని, తనకు తెలియకుండా వాటిని దొంగిలించాడనేందుకు తన దగ్గర ఆధారాలున్నాయని లావణ్య చెప్పుకొచ్చింది.
రాజ్ తరుణ్-లావణ్య కేసు వివరాలిలా..
రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌కు లావణ్య పరిచయం ఉండగా.. రాజ్‌తరుణ్ 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడు. రాజ్‌తరుణ్ 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెప్పింది. అంతేకాదు రాజ్‌తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చామంది. 2016లో రాజ్‌తరుణ్ వల్ల గర్భవతిని అయ్యా. రెండో నెలలో నాకు సర్జరీ చేశారు.
ఆస్పత్రి బిల్లులు రాజ్‌తరుణే చెల్లించాడని చెప్పిన లావణ్య.. రాజ్‌తరుణ్, మాల్వీ నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు. నన్ను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి. మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరించారు. మాల్వీతోపాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది.
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు