Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Raj Tharun – Lavanya | టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Raj Tharun – Lavanya | టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాము విడిపోవడానికి కారణం ఓ సినీ నటి అని, రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా దొరకకుండా చేస్తామని బెదిరించినట్లు సినీ నటితోపాటు ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే ఈ కేసులో పోలీసులు లావణ్యకే రివర్సులో నోటీసులిచ్చారు.
ఈ నోటీసులో ఫిర్యాదుకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించాలని 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఇంకా లావణ్య స్పందించలేదు. మరోవైపు లావణ్యను విచారణకు పిలిస్తే.. తన వైపు వాదనలను కూడా వినిపిస్తానని నటుడు రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులతో చెప్పినట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అసలు లావణ్య వర్షన్ ఏంటీ?
పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్షిప్లో ఉన్నా. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు. రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు. రాజ్ తరుణ్ నా ప్రపంచం..రాజ్ తరుణ్ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని.. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని పేర్కొంది లావణ్య.
రాజ్‌తరుణ్ ఏమంటున్నాడంటే?
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. లావణ్యతో నేను ఇంతకుముందు రిలేషన్లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్షిప్లో ఉంది. కన్న తండ్రిని కూడా లావణ్య మోసం చేసింది. ఇంట్లో ఉంటునే నన్ను టార్చర్ పెట్టింది. అందుకే లావణ్య టార్చర్ భరించలేకపోయా.. లావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసింది. అందువలనే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

