Most Extras : క్రికెట్లో అత్యధిక స్కోర్లతో రికార్డులు నెలకొల్పే బ్యాటర్లు.. బంతితో మ్యాజిక్ చేసే బౌలర్లు చాలామందే. అయితే.. ఎక్స్‌ట్రాల రూపంలో రికార్డు కొల్లగొట్టే జట్లు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. అది కూడా వన్డేల్లో. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అలాగనీ పసికూన జట్లు ఈ చెత్త రికార్డు నెలకొల్పలేదు. అగ్రశ్రేణి జట్లు అయిన పాకిస్థాన్, న్యూజిలాండ్.. భారీగా ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నాయి.
నేపియర్ వేదికగా ఈమధ్యే జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు కొట్టింది. ఆపై పాక్‌ను కివీస్ బౌలర్లు 271కే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లోనే 70 రన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చాయి. పాక్ జట్టు బైస్ రూపంలో 7, లెగ్ బైస్‌గా 13 పరుగులు రాగా.. బౌలర్లు 21 వైడ్స్‌తో పాటు రెండు నో బాల్స్ వేశారు. దాంతో, 43 అదనపు పరుగులు న్యూజిలాండ్‌కు దక్కాయి.
We take a 1-nil series lead in Napier! Wickets shared across the bowling unit with career-best ODI figures from Nathan Smith (4-60) & and an tight performance from Will O’Rourke with 1-38 from his 10 overs. Scorecard | https://t.co/CvmR1mQN5I #NZvPAK #CricketNation 📷 =… pic.twitter.com/l88Sy4fjvi
— BLACKCAPS (@BLACKCAPS) March 29, 2025
ఆ తర్వాత కివీస్ జట్టు సైతం పోటీపడి మరీ ఎక్స్‌ట్రాలు ఇచ్చింది. ఆ జట్టు బౌలర్లు 14 వైడ్స్ వేశారు. 5 లెగ్ బైస్, 8 బైస్ రూపంలో 27 పరుగులు పాక్‌కు లభించాయి.. ఒక వన్డే మ్యాచ్‌లో 70 అదనపు పరుగులు రావడం అనేది రెండో అత్యధికం. స్కాట్లాండ్, పాకిస్థాన్‌ల మధ్య 1999లో జరిగిన మ్యాచ్‌లో 96 ఎక్స్‌ట్రాలు రికార్డు అయ్యాయి. ఈ రికార్డు ఇప్పటికీ ఈ రెండు జట్ల పేరిటే ఉంది.