IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన గుజరాత్ టైటన్స్(Gujarat Titans) రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. సొంత మైదానంలో రెచ్చిపోయిన ఓపెనర్ సాయి సుదర్శన్(63) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ చిచ్చరపిడుగు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధాటిగా ఆడాడు. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి గట్టి పునాది వేశారిద్దరూ. దీపక్ చాహర్ 19వ ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో రూథర్‌ఫర్డ్(18)ను ఔట్ చేయడం.. ఆ తర్వాతి బంతికే రాహుల్ తెవాటియా రనౌట్ కావడంతో గుజరాత్ స్కోర్ 200 దాటలేదు. 20వ ఓవర్లో 10 పరుగులే రావడంతో గుజరాత్ 196 రన్స్‌కే పరిమితమైంది.
సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్()63, శుభ్‌మన్ గిల్(38) దంచేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా పవర్ ప్లేలో వికెట్ ఇవ్వలేదు ఈ జోడీ. అయితే.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో గిల్ డీప్ స్క్వేర్ లెగ్‌లో షాట్ ఆడి నమన్ ధిర్ చేతికి చిక్కాడు. 78 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (39) ఉన్నంత సేపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సాయితో కలిసి.. జట్టు స్కోర్ 120 దాటించాటాడీ హిట్టర్. 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాదిన అతడిని ముజీబ్ రెహ్మాన్ వెనక్కి పంపాడు. బట్లర్ ఔటయ్యాక షారుక్ ఖాన్(9), షెఫ్రాన్ రూథర్‌ఫర్డ్(18)లతో కలిసి స్కోర్ బోర్డును ఉరికించాడు సుదర్శన్.
Pinpoint accuracy 🎯
Chaos in the middle and Hardik Pandya capitalizes with a direct hit to run Rahut Tewatia out!
Updates ▶ https://t.co/lDF4SwnuVR #TATAIPL | #GTvMI | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/PM4YQy46y4
— IndianPremierLeague (@IPL) March 29, 2025
డెత్ ఓవర్లలో ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. దీపక్ చాహర్ ఒకే ఓవర్లో రూథర్‌ఫోర్డ్ ను ఔట్ చేయడం.. ఆ తర్వాతి బంతికే పాండ్యా డైరెక్ట్ త్రోకు రాహుల్ తెవాటియా(0) రనౌట్ అయ్యాడు. కగిసో రబడ(16) మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. రషీద్ ఖాన్(7) సైతం సిక్సర్ బాది జోరు పెంచాలనుకున్నాడు. అయితే.. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు సూపర్ డెలివరీతో రషీద్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో, గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓటమితో ఈ సీజన్‌ను మొదలుపెట్టిన ముంబై బోణీ కొట్టాలంటే ఓపెనర్లు, మిడిలార్డర్ దంచికొట్టాల్సిందే.