IPL 2025 : ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్. డేంజరస్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతులను లెగ్ సైడ్ బౌండరీలకు పంపిన హిట్‌మ్యాన్ .. నాలుగో బంతిని డిఫెన్స్ చేయబోయాడు. కానీ, సిరాజ్ విసిరిన బంతి నేరుగా బెయిల్స్‌ను తాకింది. అంతే.. 8 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(17) రెచ్చిపోయి ఆడుతున్నాడు. రబడ బౌలింగ్‌లో వరుసగా ఫైన్ లెగ్ దిశగా 4, 4, 6 బాది గుజరాత్‌పై ఒత్తిడి పెంచాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 32/1.
ఐపీఎల్ 18వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన గుజరాత్ టైటన్స్ రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. సొంత మైదానంలో రెచ్చిపోయిన ఓపెనర్ సాయి సుదర్శన్(63) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ చిచ్చరపిడుగు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధాటిగా ఆడాడు. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి గట్టి పునాది వేశారిద్దరూ.
Innings Break! #MI make a comeback with the ball, but #GT finish with 1⃣9⃣6⃣ on the board! 👌
Who will end up with 2⃣ points tonight? 🤔
Scorecard ▶ https://t.co/lDF4SwnuVR #TATAIPL | #GTvMI | @gujarat_titans | @mipaltan pic.twitter.com/o5xdBI0AlE
— IndianPremierLeague (@IPL) March 29, 2025
ఒకదశలో 230 ప్లస్ కొట్టేలా కనిపించింది గుజరాత్. కానీ, మిడిలార్డర్ వైఫల్యంతో అది సాధ్యం కాలేదు. ఆఖర్లో వైఫల్యంతో గుజరాత్ 200 ప్లస్ చేయలేకపోయింది. దీపక్ చాహర్ 19వ ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో రూథర్‌ఫర్డ్(18), రాహుల్ తెవాటియా()ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. మూడో బంతిని రబడ సిక్సర్ బాదేసి హ్యాట్రిక్ అడ్డుకున్నాడు. 20వ ఓవర్లో 10 పరుగులే రావడంతో గుజరాత్ 198 రన్స్‌కే పరిమితమైంది.