KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదిమనన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని.. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు.
ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పండగ అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో.. ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ.. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని.. అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలన్నారు. రైతన్నల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రరభుత్వాలు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఉగాది పచ్చడిలాగే జీవితంలో షడ్రుచులను ఆస్వాదించాలన్నారు. సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని బీఆర్ఎస్ అధినేత ఆకాంక్షించారు.