HomeSportsNew Zealand Won Against Pakistan 2nd Time
కివీస్ ధనాధన్.. రెండో టీ20లోనూ ఓడిన పాక్
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయదుందుభి మోగించింది.
డునెడిన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయదుందుభి మోగించింది. వర్షం వల్ల 15 ఓవర్లకే కుదించిన మ్యాచ్‌లో కివీస్.. పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్.. 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
కెప్టెన్ సల్మాన్ అలీ (46) టాప్ స్కోరర్. పాక్.. బంతితో తేలిపోవడంతో లక్ష్యాన్ని కివీస్ 13.1 ఓవర్లలోనే దంచేసింది. పాక్ ప్రధాన బౌలర్ షహీన్ అఫ్రిది తొలి ఓవర్ మెయిడిన్ వేయగా రెండో ఓవర్ నుంచి ఫిన్ అలెన్ (38), టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45, 3ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం మొదలైంది. అలీ వేసిన రెండో ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు బాదగా షహీన్ మూడో ఓవర్లో సీఫర్ట్ ఏకంగా 4 సిక్సర్లు కొట్టడంతో కివీస్ లక్ష్యం తేలికైంది.