లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీస్‌లో ఇవాళ దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని కివీస్ కెప్టెన్ సాంట్నర్ తెలిపాడు. ఇండియాతో ఆడిన జట్టుతోనే.. సెమీస్‌లోనూ ఆడతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. దక్షిణాఫ్రికాపై వత్తిడి తేవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లు తెలిపాడు. టాస్ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. టాస్ గురించి ఆందోళన చెందడం లేదని, మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. సౌతాఫ్రికా జట్టు ఓ మార్పు చేసింది. కెప్టెన్ బవుమా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో బవుమా జట్టులో చేరాడు.
A star-studded #ChampionsTrophy semi-final loading in Lahore 🇿🇦🇳🇿
Mitchell Santner calls it right at the toss, New Zealand opt to bat first 🏏#SAvNZ LIVE UPDATES ⬇️https://t.co/dGzPWxoavO
— ICC (@ICC) March 5, 2025
గ్రూపు బీ నుంచి దక్షిణాఫ్రికా టాప్‌లో ఉన్నది. మూడు మ్యాచుల్లో ఆ జట్టు రెండు గెలిచింది. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. ఇక గ్రూపు ఏ నుంచి న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉన్నది. పాకిస్థాన్, బంగ్లా జట్లపై కివీస్ గెలిచిన విషయం తెలిసిందే.