హామిల్టన్(న్యూజిలాండ్): దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సఫారీలు 235 పరుగులకు ఆలౌటయ్యారు.
బెడింగ్హామ్ (110) సెంచరీతో కదంతొక్కగా, సహచర బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. పీటర్సన్ (43),నీల్ బ్రాండ్ (34) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. విలియమ్ రూర్కీ (5/34) ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు.