డునెడిన్ (న్యూజిలాండ్) : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు.. కివీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. పేసర్ జాకబ్ డఫ్ఫీ (4/35) ధాటికి 21 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తర్వాత కోలుకోలేకపోయింది. 18.4 ఓవర్లలో ఆ జట్టు 140 రన్స్‌కే పరిమితమైంది. ఛేదనను కివీస్.. 15.4 ఓవర్లలోనే దంచేసింది.