హామిల్టన్(న్యూజిలాండ్): వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో(117 బంతులు మిగిలుండగానే) విండీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత మ్యాట్ హెన్రీ(4/43) ధాటికి విండీస్ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది.
పిచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ హెన్రీ నిప్పులు చెరిగే స్వింగ్‌తో విండీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. హెన్రీకి తోడు జాకబ్ డఫీ(2/27), మిచెల్ సాంట్నర్(2/27) చెలరేగడంతో విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
రోస్టన్ చేజ్(38), జన్ క్యాంప్‌బెల్(26) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కివీస్ 30.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. మార్క్ చాప్మన్(64) అర్ధసెంచరీకి తోడు మిచెల్ బ్రేస్‌వెల్(40) రాణించడంతో దాదాపు 20 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఫోర్డె(2/46), జేడెన్ సీల్స్(2/35) రెండేసి వికెట్లు తీశారు.