IPL 2025 : జైపూర్ గడ్డపై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) యంగ్‌స్టర్ నేహల్ వధేరా(63) దంచి కొడుతున్నాడు. బౌండరీలతో రెచ్చిపోతున్న ఈ చిచ్చరపిడుగు అర్ధ శతకం సాధించాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు 4 బాదిన అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న అతడు 25 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. మరో ఎండ్‌లో శశాంక్ సింగ్(18) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో, పంజాబ్ 15 ఓవర్లలో 147 పరుగులు చేసింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే. ధాటిగా ఆడుతున్న ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(9)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు.
Nehal Wadhera departs after a shining 70(37) ✨
With Shashank Singh still at the crease will @PunjabKingsIPL cross the 200-run mark? 🤔
Updates ▶ https://t.co/HTpvGew6ef #TATAIPL | #RRvPBKS pic.twitter.com/cKx4Ych0iy
— IndianPremierLeague (@IPL) May 18, 2025
ఆ కాసేపటికే అరంగేట్రం చేసిన మిచెల్ ఓవెన్(0)ను క్వెనా మఫాకా డకౌట్ చేశాడు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్ సింగ్(0ను దేశ్‌పాండే వెనక్కి పంపడంతో, పవర్ ప్లేలోనే పంజాబ్ కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ స్కోర్‌బోర్డును నడిపించాడు. అయితే.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.