Crime news : భార్యభర్తలన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒకసారి గొడవపడటం సహజమే. కొందరు పట్టువిడుపులతో ఆ గొడవలను పరిష్కరించుకుంటే మరికొందరు పంతాలకుపోయి వాటిని పెద్దగ చేసుకుంటారు. ఇంకా కొందరైతే ఏకంగా ఎదుటివాళ్ల ప్రాణాలే తీసేదాక వెళ్తారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని రాయ్‌బరేలీ (Raibareilly) లో అలాంటి ఘటనే జరిగింది. ఓ భర్త తన భార్యను గదిలో బంధించి, పస్తులుంచి చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీ జిల్లాలోని కరేలీ గ్రామానికి చెందిన మనోజ్ అనే వ్యక్తి తన భార్య మమతతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను గదిలో బంధించి తాళం వేశాడు. వారం రోజులపాటు ఆమెకు భోజనంగానీ, కనీసం మంచినీళ్లుగానీ ఇవ్వలేదు. దాంతో ఆకలికి అలమటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో మనోజ్ శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, ఇంటికి తాళంవేసి పారిపోయాడు.
ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టి చూడగా మమత మృతదేహం బెడ్‌షీట్‌లో చుట్టి కనిపించింది. దాంతో మనోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం మనోజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.