Neeraj Chopra Classic : భారత స్టార్ అథ్లెటల్ నీరజ్ చోప్రా (Neeraj Copra) తన కలను నిజం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన నీరజ్.. తన పేరుతో నిర్వహించిన ‘నీరజ్ చోప్రా క్లాసిక్'(Neeraj Chopra Classic)లో విజేతగా అవతరించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న బడిసె వీరుడు శుక్రవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన పోటీల్లో అదరగొట్టాడు. ఫైనల్లో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి ఛాంపియన్‌గా నిలిచాడు.
భారత అథ్లెటిక్ సమాఖ్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సహకారంతో నిర్వహించిన నీరజ్ చోప్రా క్లాసిక్‌లో నీరజ్ అంచనాలు అందుకున్నాడు. బడిసెను 90 మీటర్ల దూరం విసరకున్నా సరే అగ్రస్థానం సాధించాడు. ఈ సీజన్లో అతడికి మూడో టైటిల్. ఈమధ్యే పారిస్ డైమండ్ లీగ్, ఒస్ట్రావాలో గోల్డెన్ స్పైక్స్ టైటిల్ గెలుపొందిన నీరజ్.. ఈసారి స్వదేశంలో కుటుంబసభ్యులు సమక్షంలో టైటిల్ సాధించి మురిసిపోయాడు. కెన్యా అథ్లెట్ జులియస్ యెగొ 84.51 మీటర్లతో రెండో స్థానంలో నిలవగా, రుమెశ్ పథిరగె (శ్రీలంక) 84.34 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు.