IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(161) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా(69 నాటౌట్), రిషభ్ పంత్(61) అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు. సెంచరీ భాగస్వామ్యాలతో జట్టుకు భాకొండంత స్కోర్ అందించాడు గిల్. క్రీజులో పాతుకుపోయిన సారథికి వైస్ కెప్టెన్ పంత్, జడ్డూలు చక్కని సహకారం అందించారు. నాలుగోరోజు ఆటకు మరో ౧18 ఓవర్లు ఉన్నాయనగా టీమిండియా 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆతిథ్య జట్టు ముందు 608 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది గిల్ సేన.
లీడ్స్‌లో చేజేతులా ఓడిన టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ డ్రైవర్ సీట్లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లో కొత్త బంతితో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేసినా కేఎల్ రాహుల్(55) సంయమనంతో ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికించాడు. కరుణ్ నాయర్(26)ను ఔట్ చేసిన కార్సే బ్రేకివ్వగా.. కాసేపటికే టంగ్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ, స్టోక్స్ సేన సంబురాన్ని ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(61) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. ప్రత్యర్థికి బజ్ బాల్ తరహా ఆటను రుచిచూపిస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పంత్, శుభ్‌మన్ గిల్(161) జోడీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో భారత ఆధిక్యాన్ని 350కి పెంచింది.
#TeamIndia declare at 427/6 and secure a mighty 607-run lead! 👏 👏
161 for captain Shubman Gill
69* for Ravindra Jadeja
65 for vice-captain Rishabh Pant
55 for KL RahulUpdates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill | @imjadeja | @RishabhPant17 | @klrahul pic.twitter.com/S7kgHbjhs2
— BCCI (@BCCI) July 5, 2025
లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విరామం తర్వాత టంగ్ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో నలభైల్లోకి వచ్చిన గిల్.. బౌండరీతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ కాసపటికే పంత్ కూడా ఫిఫ్టీకి చేరువయ్యాడు. దూకుడే మంత్రంగా ఆడుతున్న పంత్ టంగ్ ఓవర్లో సిక్సర్ బాదగా టీమిండియా ఆధిక్యం 400 దాటింది. వీళ్లిద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని బషీర్ విడదీశాడు. పంత్ వికెట్ పడ్డాక భారత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది.
పంత్(61), రాహుల్(55)
టీ సెషన్ తర్వాత దూకుడు పెంచిన రవీంద్ర జడేజా(69 నాటౌట్) కెరీర్లో 33వ అర్ధ శతకం సాధించాడు. రూట్ ఓవర్లో సిక్సర్‌తో 150కి చేరువయ్యాడు. ధాటిగా ఆడేక్రమంలో బషీర్ ఓవర్లో గిల్ అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, ఏదో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నితీశ్ రెడ్డి(1) మరోసారి నిరాశపరిచాడు. కానీ, వాషింగ్టన్ సుందర్(12 నాటౌట్)లు ధనాధన్ ఆడి ఆధిక్యం ఆరొందలకు చేరింది. కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో 608 పరుగుల భారీ లక్ష ఛేదనకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్.