కట్టంగూర్, జులై 05 : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతిచెందారు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ శివారులో శనివారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన పిట్టల శంకరమ్మ (45), ఆమె కుమారుడు రజినీకాంత్ (26) బైక్పై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో బంధువు దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో కట్టంగూర్ గ్రామ శివారులో రోడ్డుపై నిలిపిన ట్రాలీ లారీని వెనుక నుండి ఢీకొట్టాడు. దీంతో రజినీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా, శంకరమ్మ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం నార్కట్పల్లి కామినేని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.