Paris Olymipics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో పతకం కోసం నిరీక్షిస్తున్న భారత్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. జావెలిన్ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ స్వర్ణం రేసులో అందరికంటే ముందున్నాడు. బుధవారం జరుగనున్న ఫైనల్లో బంగారు పతకం కోసం సహచరుడు అర్షద్ నదీమ్ (Arshad Nadeem)తో నీరజ్ పోటీ పడనున్నాడు. రాత్రి 11:55 నిమిషాలకు పోటీ మొదలవ్వనుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి, నిరుడు ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్‌తో మెరిసిన నీరజ్‌కు అర్షద్ పోటీనిస్తాడా? అనేది ఆసక్తిగా మారింది. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరి పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, రికార్డులు మాత్రం నీరజ్‌కే అనుకూలంగా ఉండడం విశేషం.
Will it be Neeraj Chopra or Arshad Nadeem who brings home the gold? Let the battle of the titans begin! 🇮🇳 vs 🇵🇰
#javelinthrow #goldenclash #IndiaVsPakistan #olympics2024 #OlympicGamesParis2024#ArshadNadeem #INDvsSL #Paris2024 #NeerajChopra pic.twitter.com/Yr5OrSXlUk
— The wide Yorker (@TheWideYorker) August 8, 2024
విశ్వ క్రీడల్లో ఆగస్టు 6 మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోనే అంత దూరం బడిసెను విసిరి పతకం వేటలో అడుగు ముందుకేశాడు. మరోవైపు పాక్ అథ్లెట్ అర్షద్ 86.59 మీటర్ల దూరంతో నాలుగో స్థానం సాధించాడు. అయితే.. ఫైనల్లో అతడి నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురవ్వనుంది.
ఎందుకంటే. భారత అథ్లెట్ ఇప్పటివరకూ 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. కానీ, అర్షద్ గతంలో ఈటెన్ 90 మీటర్ల దూరం విసిరాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో అర్షద్ విసిరిన జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరంలో పడింది. అయితే.. ఇప్పటివరకూ జావెలిన్ త్రోలో నీరజ్‌ను అర్షద్ ఓడించింది లేదు. వీళ్లిద్దరూ గతంలో 9 సార్లు తలపడగా.. ఆ తొమ్మిది పర్యాయాలు భారత అథ్లెట్ పైచేయి సాధించాడు. దాంతో, ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం కానుందా? అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.