Patang Movie | జెస్సీ గిఫ్ట్ స్వరం మళ్లీ వినిపిస్తోంది.. ‘అందాల తారకాసి’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న జెస్సీ
Patang Movie | జెస్సీ గిఫ్ట్ ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చే పాట యువసేన చిత్రంలోని మల్లీశ్వరివే.. మధుర ఆశల మంజరివే.. అంటూ కొనసాగే ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్‌సెట్టర్ వినగానే.. ఆకట్టుకునే స్వరంతో ఒక టైమ్‌లో కుర్రాకారు హృదయాలను తన గానంతో, స్వరాలతో మ్యాజిక్ చేశాడు.
Patang Movie | జెస్సీ గిఫ్ట్ ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చే పాట యువసేన చిత్రంలోని మల్లీశ్వరివే.. మధుర ఆశల మంజరివే.. అంటూ కొనసాగే ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్‌సెట్టర్ వినగానే.. ఆకట్టుకునే స్వరంతో ఒక టైమ్‌లో కుర్రాకారు హృదయాలను తన గానంతో, స్వరాలతో మ్యాజిక్ చేశాడు. చాలా కాలం తరువాత ఓ తెలుగు పాటలో మళ్లీ జెస్సీ గిఫ్ట్ స్వరం వినబోతున్నాం. ఆ చిత్రమే పతంగ్.
పతంగుల పోటీ నేపథ్యంలో కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి అందాల తారకాసి. రాకాసి.. నా గుండె కోసి కోసి కోరికేయకే.. అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను జెస్పీ గిఫ్ట్‌తో పాటు ఎమ్.ఎమ్.మానసి ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటకు జోస్ జిమ్మి సంగీతం అందించాడు. దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్ మెలోడిగా సాంగ్‌గా తెరకెక్కిన ఈ సాంగ్ యూత్‌తో పాటు అందరిన్ని అలరిస్తుంది. ఈ పాట మెలోడి సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలబడుతుందనే నమ్మకం వుంది. క్యాచీ లిరిక్స్‌తో.. ఫ్రెష్ ట్యూన్‌తో ఈ పాట మెస్మరైజ్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అన్నాడు అంతేకాదు పతంగ్ సినిమా పాతబస్తీ నేపథ్యంలో కొనసాగుతుందని. హైదరాబాద్ కల్చర్‌ను ఈ సినిమాలో సంపూర్ణంగా చూపెడుతున్నామని, థియేటర్లో చిత్రం యూత్ఫెస్టివల్గా వుండబోతుందని చెబుతున్నారు మేకర్స్. కథే హీరోగా రూపొందిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మా చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన అంటున్నారు పతంత్ యూనిట్ సభ్యులు.
Also Read..
- Stock Market Close | ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ..! నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
- Diamond Firm | ఆర్థిక మాంద్యం భయాలు.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సూరత్ డైమండ్స్ సంస్థ
- Hyderabad | హైదరాబాద్‌లో షాపుల మూసివేత టైమింగ్స్‌పై గందరగోళం..! సీఎం రేవంత్ మాటలు ప్రకటనలకే పరిమితమా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

