Krishnappa Gowtham : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ క్రిష్ణప్ప గౌతమ్ (Krishnappa Gowtham) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అభిమానుల మనసులు గెలిచిన అతడు హఠాత్తుగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ సహ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం గౌతమ్ వెల్లడించాడు. దాంతో.. అతడి 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. టీమిండియా ఆటగాడిగా ఒకేఒక టీ20 మ్యాచ్ ఆడిన గౌతమ్‌కు మరో అవకాశం రాలేదు. ఐపీఎల్‌లోనూ ఎవరూ కొనకపోవడంతో క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడీ స్పిన్నర్.
కర్నాటక తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు క్రిష్ణప్ప గౌతమ్. 2012లో రంజీ సీజన్లో ఉత్తరప్రదేశ్‌పై స్పిన్ ఆల్‌రౌండర్‌గా తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో సురేశ్ రైనా, భువనేశ్వర్ కుమార్‌లను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి నుంచి కర్నాటక జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన గౌతమ్ 2016-17 సీజన్లో అద్భుతంగా రాణించాడు. 8 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
Krishnappa Gowtham retired from cricket today. His 11-ball 33 against Mumbai Indians, where he won it single-handedly for Rajasthan,is unforgettable.
Interestingly, in that match, RR had sent him to bat even below Jofra Archer!
Thank you for being a part of the CSK family 🙏 pic.twitter.com/7DodDCwIKk
— Neeraj (@NeerajY00859341) December 22, 2025
అస్సాంపై సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. లిస్ట్ ఏలో 68, ఫస్ట్ క్లాస్‌లో 59 మ్యాచుల్లో మొత్తంగా 320 వికెట్లు కూల్చాడు. ఇండియా ఏ తరఫున న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లయన్స్ జట్లతో ఆడిన గౌతమ్.. టీమిండియా జెర్సీతో ఒకేఒక టీ20 ఆడాడు.
దేశవాళీలో అదరగొట్టిన క్రిష్ణప్ప గౌతమ్ ఐపీఎల్‌లోనూ తన ముద్ర వేశాడు. ఐదు జట్లకు ఆడిన గౌతమ్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 వేలంలో చెన్నై రూ.9.25 కోట్లకు ఈ ఆల్‌రౌండర్‌ను కొన్నది. మొత్తంగా తొమ్మిది సీజన్లలో గౌతమ్ రూ.35 కోట్లు ఆర్జింజాడు.
🚨 RETIREMENT NEWS 🚨
Karnataka’s all-rounder Krishnappa Gowtham has officially announced his retirement from cricket 🏏💔
Gowtham leaves behind memories that Karnataka cricket fans won’t forget. A true domestic warrior who always stepped up when the team needed him 💪🔥
🫡🏏 pic.twitter.com/2tXIaI5oi2— sports__life (@statecraft__) December 22, 2025