నల్లగొండ, డిసెంబర్ 22 : మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరంతర ప్రయత్నాలు చేస్తామని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీసు శాఖ అన్ని విధాలా కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన దివంగత ఎస్ఐ సీత్యా నాయక్ భార్య దాస్లీ బాయికి ‘చేయూత’ పథకం కింద ఎస్పీ రూ.2 లక్షల చెక్కును అందజేసి, కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.