రామవరం, డిసెంబర్ 22 : సింగరేణి మత సామరస్యానికి ప్రతీక అని, ఒకరిని ఒకరు గౌరవిస్తూ అన్ని మతాల వారు అన్ని పండుగలను కలిసి జరుపుకునే సంప్రదాయం చాలా గొప్పదని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్న క్రిస్టియన్ సహోదరులందరికీ, సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏం.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం (పర్సనల్) జీవీ మోహన్ రావు, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జై గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహారావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, డీజీఎం (ఈ &ఎం) జె. క్రిస్టఫర్, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సింగరేణి కొత్తగూడెం ఏరియా పద్మావతి గనిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో గని మేనేజర్ ఎం. వి. ఎన్. ఎస్ శ్యాంప్రసాద్. ఎండి రజాక్, గట్టయ్య, చిలక రాజయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Ramavaram : కొత్తగూడెం ఏరియాలో సెమీ క్రిస్మస్ వేడుకలు