Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో వెండి పతకం కొల్లగొట్టిన భారత బడిసె వీరుడు నీరజ్ చోప్రా(Neeraj Chopra ) మరో టోర్నీకి సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో తన పేరిట తొలిసారి నిర్వహిస్తున్న జావెలిన్ పోటీల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు నీరజ్. మే 24న జరగుబోయే ‘నీరజ్ చోప్రా క్లాసిక్ 2025’ పోటీల్లో పాల్గొనాల్సిందిగా పలువురు అథ్లెట్లకు సందేశాలు పంపిస్తున్నాడీ అథ్లెట్. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్.. స్నేహితుడు అయిన అర్షద్ నదీమ్(Arshad Nadeem)ను భారత్‌కు రావాల్సిందిగా చోప్రా ఆహ్వానించాడు. అందుకు నదీమ్ స్పందించాల్సి ఉంది.
‘పోటీల్లో పాల్గొనాల్సిందిగా నదీమ్‌ను సంప్రదించాను. ఈ విషయమై అతడు తన కోచ్‌తో మాట్లాడనున్నాడు. టోర్నీలో పాల్గొనేది? లేనిది? త్వరలోనే తెలియనుంది అని చోప్రా వెల్లడించాడు. అయితే.. పాకిస్థాన్‌తో దైత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లే జరగడం లేదు. అలాంటిది పాక్ అథ్లెట్‌ను భారత్‌కు పంపించడం అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది.
Who Wants To See Neeraj vs Arshad at Bengaluru
Repost if you plan to be IN THE STADIUM 🏟️ to cheer for #NeerajChopra https://t.co/cWJq2dRFkD pic.twitter.com/KfY838vuf2
— IndiaSportsHub (@IndiaSportsHub) April 21, 2025
ఒకవేశ నదీమ్‌కు పాక్ ప్రభుత్వం అనుమతిస్తే.. తుది జాబితాలో అతడి పేరును చేరుస్తాం’ అని చోప్రా తెలిపాడు. పంచకులలో మే24న జరగాల్సిన పోటీల వేదిక మారింది. బెంగళూరులోని కంఠీరావ స్టేడియంలో నిర్వహించనున్నారు. మాజీ ప్రపంచ ఛాంపియన్లు అండర్సన్ పీటర్స్(గ్రెనెడా), జులియర్ యెగో(కెన్యా)లు పోటీల్లో పాల్గొనేందుకు సిద్దమని ఇప్పటికే చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ రజతంతో చరిత్ర సృష్టించాడు. టోక్యోలో పసిడితో మెరిసిన అతడు.. వరుసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్యారిస్‌లో స్వర్ణంపై గురి పెట్టిన చోప్రాకు నదీమ్ షాకిచ్చాడు. ఏకంగా ఈటెన్ 90 మీటర్ల దూరం విసిరాడు నదీమ్. దాంతో, భారత స్టార్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు.