కామారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డికి సంక్షేమం పట్ల అవగాహన లేదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. మంగళవారం చలో వరంగల్ సభ సన్నాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల ఆగ్రానికి గురైందన్నారు. రైతుల రుణమాఫీ, రైతుబంధు సైతం అమలు చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని, అనతి కాలంలోనే అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంభాల రవి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్, కృష్ణాజీ రావు, కాసర్ల స్వామి, పిట్లవేలు లక్ష్మీనారాయణ, పార్టీ అధికార ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, బలవంతరావు, లింగారావు, జగదీష్ యాదవ్, భూమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.